కొడుకు భార్య అంటే కూతరుతో సమానం అంటారు. కన్నకూతురులా.. కొందరు చూసుకుంటారు. కానీ ఓ కామాంధుడు అదే కోడలిపై దుర్బుద్ధితో చెయ్యి వేశాడు. మొక్కజొన్న తోటలో కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. ఎంతకూ వినకపోవడంతో బండ రైతు కొట్టి చంపాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన సంచలనంగా మారింది
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో జరిగిన శిరీష హత్య సంచలనంగా మారింది. హంతకుడు సొంతం మామగా పోలీసులు నిర్ధారించారు. శిరీష కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామానికి చెందిన కురుమన్న(56) కొడుకు నరసింహ(34)తో 12 ఏళ్ల క్రితం జూపాడు బంగ్లా మండలం మండ్లెం గ్రామానికి చెందిన శిరీష(30) పెళ్లయింది. శుక్రవారం(అక్టోబర్ 18) మొక్కజొన్న తోటలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఉదయం మామ కురుమన్న తో కలిసి శిరీష మొక్కజొన్న తోటకు వెళ్ళింది. దుర్బుద్ధి పుట్టడంతో తోట మధ్యలో శిరీషపై కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. శిరీష వినలేదు. పెనుగులాట జరిగింది. ఎంత ఒత్తిడి చేసిన వినకపోవడంతో.. ఒక్కసారిగా కోపం భరించలేక బండ రైతు కొట్టి చంపాడు కురుమన్న.
శిరీష ఎంతకూ ఇంటి తిరిగి రాకపోవడంతో భర్త నరసింహ, ఆయన తల్లి వెతకడం మొదలుపెట్టారు. చివరికి మొక్కజోన్న తోటలో శవమై కనిపించింది శిరీష. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం కర్నూలుకు తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కురువన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే శిరీషను చంపింది కురుమన్న అన్న అనుమానంతో ఆమె కుటుంబీకులు మాండ్లెం గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. వావి వరసలు లేకుండా ప్రవర్తించిన కురుమన్నను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉండగా, కురుమన్నపై గతంలోనే ఫోక్సో కేసు నమోదైనట్లు సమాచారం
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే