SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్ అప్పులు!



పలమనేరు: కేవలం ఆధార్ కార్డుతో అప్పులిచ్చి అధిక వడ్డీలతో  జనం రక్తాన్ని తాగుతున్న మైక్రోఫైనాన్స్ దాష్టీకానికి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు. వాటిని కట్టేందుకు మరిన్ని అప్పులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి సమాధి సాక్షిగా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ గ్రామంలో మంగళవారం జరిగింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తలారి గంగప్ప కుమారుడు తలారి మోహన్ (43) ఉన్న 40 సెంట్ల స్థలంలో వ్యవసాయం, ఖాళీ సమయంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అవసరాల నిమిత్తం కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలనుంచి రుణం తీసుకున్నాడు.

అధిక వడ్డీలతో వీటిని చెల్లించలేకపోవడం, పైగా వారినుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో మంగళవారం పొలానికెళ్లి తండ్రి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, డిగ్రీ, ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారు.

Also read

Related posts

Share this