మనిషి మనుగడ నీరు. అలాంటి నీటి కోసం బావులు, కాలువలు తవ్వడం, బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించదు. లోతైన బోర్లు తవ్వి మోటార్లు బిగించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మోటారు కానీ, బావి కానీ లేకుండానే లేకుండానే సహజసిద్ధంగా పాతాళ గంగ ఉబికి వస్తోంది. బోరు బావి నుంచి నీరు ఉబికి వస్తోంది. ఈ అరుదైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
మొన్నటి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం మొదలై రెండు నెలలు అవుతున్నా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసాయి. గత కొన్ని రోజులుగా క్రితం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. అన్ని చోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చాలావరకు చెరువులు మత్తడి పోస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎండిపోయిన బోర్లు కూడా ఇప్పుడు పైపుల నిండుగా నీరు పోస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా బోరు బావుల్లో నుంచి జలాలు ఉబికి వస్తున్నాయి.. ఇలాంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో కనిపించింది.
లింగయ్య అనే రైతు పొలంలో బోరు ఉంది. దాని నుండి పవర్ ఆన్ చేయకుండానే నీరు ఎగిసిపడుతోంది. బోరు ఉన్న ప్రాంతం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి… బోరు ఆన్ చేయకుండానే నీరు వస్తుండడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒక్కసారిగా బోరు నుండి ఉబికి వస్తుండగా స్థానికులు వీడియో రికార్డు చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగిన వాగులు ,వంకలు కారణంగానే ఓవర్ ఫ్లోతో ఇలా గంగ ఉప్పొంగి బోరు నుండి ఇలా ఉబికి వస్తుందని అంటున్నారు స్థానికులు. మొత్తానికి.. ఇలాంటి దృశ్యాలు కనబడటం అరుదు.. అయితే… ఈ బోరుబావిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు స్థానికులు. ఇప్పుడు ఈ బోరు బావి నుంచి ఉబికి వస్తున్న నీరు విజువల్స్ వైరల్ గా మారాయి
తాజా వార్తలు చదవండి
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





