అప్పట్లో తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులి పశువుల మందపై దాడికి ప్రయత్నించింది. ఆ తరువాత మంగపేట మండలంలో ఓ లేగ దూడపై దాడి చేసి, చంపేసింది. కొద్ది రోజులకు మంగపేట మండలంలోని శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెం సమీపంలో మేత కోసం వెళ్లి ఆవుల మందపై కూడా పెద్ద పులి దాడికి దిగింది. ఈ దాడిలో ఓ లేగ దూడ మృత్యు వాత పడింది.
ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మేడారం, బయ్యక్కపేట అడవుల్లో పులిజాడ కోసం వెతుకుతున్నారు అటవీశాఖ అధికారులు. మహదేవ్ పూర్ మండలం గొత్తికోయగూడెంలో ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పులి ఆనవాళ్ళు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
గతంలో కూడా ములుగు జిల్లాలోని ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి.. అప్పట్లో తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులి పశువుల మందపై దాడికి ప్రయత్నించింది. ఆ తరువాత మంగపేట మండలంలో ఓ లేగ దూడపై దాడి చేసి, చంపేసింది. కొద్ది రోజులకు మంగపేట మండలంలోని శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెం సమీపంలో మేత కోసం వెళ్లి ఆవుల మందపై కూడా పెద్ద పులి దాడికి దిగింది. ఈ దాడిలో ఓ లేగ దూడ మృత్యు వాత పడింది.

పులి కదలికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరియు సమీప గ్రామాల నివాసితులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశువులను మేపడానికి ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అటవీ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు.
Also Read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య