వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగల రూట్ వేరు. పగలు బొంతలు కుట్టుతూ జీవనం సాగించే వీళ్లు, రాత్రిళ్లయితే తాళం వేసిన ఇళ్లను గుళ్ల చేస్తున్నారు. పెద్దగూడెం తండాలో బాణావతు ప్రసాద్ ఇంట్లో 30 తులాల వెండి, బంగారు ఆభరణాలు దోచుకున్న వీరిని పోలీసులు ప్రత్యేక బృందాలతో సాకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్నారు.
వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగల రూటే సెపరేట్. ఉదయం బొంతలు కుట్టే వ్యాపారం చేస్తూ… రాత్రి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుళ్ల చేస్తుంటారు. జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 26 వ తేదీన చోరీ జరిగింది. పెద్దగూడెం తండాకు చెందిన బాణావతు ప్రసాద్ అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌కు చికిత్స పొందేందుకు కుటుంబంతో సహా వెళ్ళాడు. తిరిగి ఈ నెల 07 తేదిన ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బంగారు పుస్తెలతాడు, కమ్మలు, మాటీలు, గొలుసు, ఉంగరం.. 30 తులాల వెండి వస్తువులు చోరికి గురయ్యాయి. దీంతో ప్రసాద్ వనపర్తి రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాకేంతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుల మూమెంట్‌పై నిఘా పెట్టారు. పెద్దగూడెం X రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నేరస్తులు ఆరుగురు ఓమిని వ్యాన్‌లో రావడాన్ని గమనించారు. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా దొంగతనాన్ని ఒప్పుకున్నారు.
నిందితుల అంతా ఒక ఓమిని వ్యాన్‌లో తిరుగుతుంటారు. వీళ్ల వృత్తిలో భాగమైన బొంతలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే రకంగా వివిధ గ్రామాలలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ముందుగానే గుర్తించి.. ఆ రోజు పగలు అక్కడే ఉండి రాత్రి సమయంలో చోరికి స్కెచ్ వేస్తారు. తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఇంటి తాళం, బీరువాలను పగలగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి, నగదును దొంగిలించుకుని వెళ్ళిపోతారు. A1 కొండ హరికృష్ణ, A2 గుజ్జుల కృష్ణయ్య, A3 గుజ్జుల వినోద్, A4 గుజ్జుల భాగ్య లక్ష్మి, వీరందరు కొత్తపేట గ్రామం పెద్దకొత్తపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌కు చెందిన వారు కాగా… A5 గుజ్జుల రాజశేఖర్, A6 గుజ్జుల లక్ష్మి ఇద్దరూ వనపర్తి జిల్లా పెబ్బైర్ పట్టణానికి చెందినవారు.
వీరిపై వనపర్తి రూరల్, పెబ్బేర్, ఆత్మకూరుతో పాటు… నాగర్ కర్నూలు జిల్లాలలో వివిధ పోలీస్టేషన్లో దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఇక నిందితుల వద్ద రూ.25 వేల నగదు, 25 గ్రాముల బంగారం, 43 తులాల వెండి, ఓమిని వ్యాను, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!