గలీజ్ దందా…. జైలుకి వెళ్లి వచ్చినా రూట్ మార్చడం లేదు. డబ్బు ఆశచూపి మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. ఎంతో కొంత డబ్బు వస్తుందని ఆశించి.. అమాయక మహిళలు అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించారు.
ఇప్పుడు యూత్‌కు ఉన్న అతి పెద్ద ముప్పు ఏంటి అంటే.. డ్రగ్స్. అందులోనూ చీప్‌గా దొరికే గంజాయి. ఇది వారిని మత్తులో జోగేలా చేస్తుంది. జీవితాలను చిత్తు చేస్తుంది. గంజాయికి అలవాటు పడినవారు అది లేకపోతే అల్లాడిపోతున్నారు. దాన్ని కొనేందుకు ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే గంజాయి క్రియేటివ్‌గా స్మగ్లింగ్ చేస్తూ.. ఎంతోమంది పోలీసులకు చిక్కారు. కార్లు, బైక్‌లు, వ్యాన్లు, లారీల్లో గంజాయి రవాణా చేస్తూ చాలామంది పట్టుబడ్డారు. ఇప్పుడు ఏకంగా.. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఈ మత్తు పదార్థాన్ని రవాణా చేసేందుకు పూనుకున్నారు. మహిళలు అయితే ఎవరూ పెద్దగా చెక్ చేయరు అనుకున్నారో ఏమో.. ఈ దిక్కుమాలిన పని కోసం మహిళలను వినియోగిస్తున్నారు.
తాజాగా రైలులో నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నమహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలను వరంగల్ రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి నుంచి 203.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ.50.85 లక్షలుగా అంచనా వేశారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లోని కంపార్ట్‌మెంట్ సీట్ల కింద గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన మహిళలు మహారాష్ట్రలోని జల్‌గావ్‌కు చెందిన చందాబాయి భీమా బెల్దార్, ఉషా దిలీప్ చౌహాన్‌లుగా గుర్తించారు. వారు విజయవాడలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకువెళ్లినట్లుగా అంగీకరించారని ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి నరేష్ తెలిపారు. రైళ్లలో కూడా నిత్యం తనిఖీలు ఉంటాయని.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు.. పోలీస్ డాగ్స్‌కు పత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం