అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మానవత్వం కూడా మంట గలిసిపోతోంది.. కొందరయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లిలోని కూనారం గేటు సమీపంలో ట్రాక్ మధ్యలో రెండు నెలల వయస్సు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు.
అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మానవత్వం కూడా మంట గలిసిపోతోంది.. కొందరయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లిలోని కూనారం గేటు సమీపంలో ట్రాక్ మధ్యలో రెండు నెలల వయస్సు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. రైల్వే సిబ్బందికి పసికందు ఏడుపు వినిపించడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. రామగుండం రైల్వే సీఐ సురేష్ గౌడ్ తన సిబ్బందితో వచ్చి శిశువును ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి, చికిత్స అందించారు. అయితే శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం అందించి ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నారు.
పట్టాలపై శిశువును వదిలి వెళ్లిన వారికి కఠినమైన శిక్షలు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నవ మాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి కూడా తన బిడ్డను వదులుకోవడాన్నిఎలా ఒప్పుకుందని.. ఇంత కర్కషత్వం ఎందుకని.. ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇలాంటి వారి కంటే, జంతువులే బెటర్ అని అనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
అయితే.. పోలీసులు ఈ ఘటనపై కేసు
నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అధికారులు.. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో చిన్నారి ప్రాణం దక్కిందని పోలీసులు తెలిపారు
Also read
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు
- రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..





