మెదక్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం గోమారంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు.. మతిస్తిమితం కోల్పోయిన ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సుమారు 40 ఏళ్లు ఉండే ఓ వ్యక్తి గోమారం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మతిస్తిమితం కోల్పోవడంతో హిందీ మాట్లాడుతూ గ్రామంలో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో దొంగతనం చేశాడనే నెపంతో గోమారం గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, మణికంఠగౌడ్‌లు మద్యం, గంజాయి మత్తులో అతనిపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

అంతేకాదు అతన్ని తాళ్లతో బైక్‌కు కట్టేసి ఊరంతా తిప్పడంతో అతని తీవ్రగాయాలయ్యాయని.. దీంతో అతను చనిపోయినట్లు గుర్తించారు. కొట్టొద్దని కాళ్లావేళ్లాపడినా కనికరించకుండా.. రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి అతడిపైకి బైకు ఎక్కించి అమానుషంగా ప్రవర్తించారు. బైకుకు కట్టి ఈడ్చుకుంటూ వెళ్లి ఓ చోట పడేశారు.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్టాండ్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 6న నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు.

అయితే, ఈ ఘటనపై పోలీసులు మాత్రం మరోలా చెబుతున్నారు. గ్రామంలో చిన్న దొంగతనం జరగడంతో కొత్తగా వచ్చిన వ్యక్తిని పట్టుకొని చితకబాది, అక్కడే పడేసి వెళ్లడంతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. తిరుపతిరెడ్డి, మణికంఠగౌడ్‌లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఓ వ్యక్తి పట్ల అమానుషంగా ప్రవర్తించి చంపిన నిందితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు