SGSTV NEWS
CrimeTelangana

పల్టీ కొట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారమివ్వడంతో , గాయపడిన వారిని స్థానిక జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టిందని సమాచారం.


హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తోన్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌ రోడ్డు చంద్రగిరి విల్లాస్‌ కాలనీకి వెళ్లే దారి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారమివ్వడంతో , గాయపడిన వారిని స్థానిక జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టిందని సమాచారం.


ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తోందని తెలిసింది. మర్రిగూడ బైపాస్‌ వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టింది. సుమారు 35 మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా.. బస్సు పల్టీకొట్టడంతో వారంతా హాహాకారాలు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు

Also read

Related posts

Share this