ఓ వైపు ఎండలు దంచికొడుతుండటం.. మరోవైపు సమ్మర్ హాలీడేస్ దగ్గర పడుతుండటంతో పిల్లలు, పెద్దలు వేసవి తాపాన్ని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమ్మర్ కు చెక్ పెట్టేందుకు చాలామంది స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ సేదతీరుతున్నారు. అయితే ఆనందాల మాటున విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో బషీరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఎనిమిదేళ్ల బాలిక మునిగి మృతి చెందింది.
ఆదివారం బాలిక తండ్రి ఆమెను స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. ఈత కొట్టిన తర్వాత బట్టలు మార్చుకునేందుకు ఓ గదిలోకి వెళ్లిన తండ్రి తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. ఆమె కోసం గాలించగా ఆమె స్విమ్మింగ్ పూల్ లో కనిపించిందని వారు తెలిపారు. సమీపంలోని కొందరి సాయంతో బాలికను స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక స్విమ్మింగ్ పూల్ లో దూకి మునిగిపోయిందని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
చాలామంది ఈత కొట్టేటప్పుడు పిల్లలను గమనించడం మరిచిపోతుంటారు. మీ పిల్లవాడు చిన్నవాడైనా లేదా ఈతవచ్చినా సరే అలర్ట్ గా ఉండాలి. మీరు పూల్ ప్రాంతంలో విడిచిపెట్టినట్లయితే, ఒక్క క్షణం అయితే మీ బిడ్డను మీతో తీసుకెళ్లండి. నీళ్లలో దిగినప్పుడు వారితో ఉండాలి. పూల్ వద్ద తలుపులు, కిటికీలకు సరైన భద్రతా పరికరాలను అమర్చాలి. ఈత కొట్టిన తర్వాత పూల్ గేటును మూసి ఉంచండి. తద్వారా మీరు లేకుండా పిల్లలు లోపలికి వెళ్ళలేరు. దానిని ఎప్పుడూ తెరవలేరు కూడా. ఈతకు వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చ
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025