April 18, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: రెండు రోజుల్లో పెళ్లి.. హల్ది సంబరాల్లో కుటుంబం.. ఇంటిని లూటీ చేసిన దొంగలు..!



పెళ్లింట దొంగలు పడి, 133 తులాల బంగారు అభరణాలు, 80తులాల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదు చోరీ చేశారు.


రెండు రోజుల్లో పెళ్లి జరిగే ఇంట్లో భారీ ఎత్తున బంగారం, నగదు చోరీ అయిన సంఘటన హైదరాబాద్‌ మహానగరం శివారులో చోటుచేసుకుంది. పెళ్లింట దొంగలు పడి, 133 తులాల బంగారు అభరణాలు, 80తులాల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదు చోరీ చేశారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా సీన్‌ మారింది.


పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్శి రాధా బాలకృష్ణ కూతురు వివాహం నవంబర్‌ 20న జరగాల్సి ఉంది. ఇటీవల కొనుగోలు చేసిన బంగారం అంతా ఇంట్లోనే బీరువాలో భద్రపరిచారు. ఆదివారం(నవంబర్‌ 17) రోజు పెళ్లి సంబరాలలో భాగంగా హల్ది కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం మెహందీ కార్యక్రమం సైతం పూర్తి చేసుకుని మహిళలు రాత్రి ఒంటిపై ఉన్న నగలు పెట్టేందుకు అల్మారాను తెరిచారు. దీంతో అల్మారాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనిపిం చకపోవడంతో వారు లబోదిబోమంటూ రోదించారు.

అల్మారాలో పెట్టిన పెద్ద ఎత్తున బంగారం చోరీ అయిందని తెలియడంతో బంగారం, వెండి ఆభరణాల కోసం ఇంట్లో పూర్తిగా వెతికారు. ఎక్కడా నగలు కనిపించకపోయేసరికి చేసేదీ లేక అర్ధరాత్రి 12.30లకు శంకర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన నార్సింగి ఏసీపీ రమణగౌడ్, శంకర్ పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన బీరువాను పరిశీలించారు. తాళం చెవులు దాచిన డ్రాను అడిగి తెలుసుకున్నారు.


బయటి వారితో పాటుగా బందువులు ఎంత మంది వచ్చారు. నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను పోలీసులు ఆరా తీశారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రను సేకరించారు. బయటి వారితో పాటుగా బంధువుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరాతీశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Also read

Related posts

Share via