కామారెడ్డి నిజాంసాగర్ మండలోని చిన్న ఆరెప్పలికి చెందిన చెన్నబోయిన అనిల్ అనే వ్యక్తి శుక్రవారం జరిగిన బంధువుల వివహా వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్నం పెళ్లి అయిన తర్వాత పెళ్లింటి బంధువులు సాయంత్రం బరత్ వేడుకను ఏర్పాటు చేశారు. బరాత్‌లో డ్యాన్స్ చేయాలి అనిల్ ఎంతో ఆశపడ్డాడు. అయితే అందుకు భార్య నిరాకరించింది.
డ్యాన్స్ చేయడం వద్దు అనేసరికి అనిల్ ఒక్కసారి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపైనా అనిల్ తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. కాసేపటికి అనిల్ ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. డ్యాన్స్ వద్దన్న కారణంగా మనస్థాపానికి గురైన అనిల్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనల స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే అనిల్‌కు మతి స్థిమితం సరిగ్గా ఉండదని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతాయి
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





