కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్పిరిట్‌తో మద్యాన్ని కల్తీ చేసి వైన్స్, బార్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 600 లీటర్ల కల్తీమద్యం, 180లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాకు పాల్పడుతున్న నిందితులకు కొందరు వ్యాపారులు, బెల్టుషాప్‌ల నిర్వాహకులు సైతం సహకరిస్తున్నట్లు గుర్తించారు.
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. గెలుపు కోసం రంగం సిద్ధం చేసుకుంటారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు మరికొందరు కూడా సిద్ధమవుతున్నారు. ఈ కేటుగాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎందుకు సిద్ధమవుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! మరి ఆ కేటుగాళ్లు ఏం సిద్ధం చేశారు తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే..!
ఈజీ మని కోసం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు స్థానిక సంస్థలను వినియోగించుకోవాలని ఓ ముఠా ప్లాన్ చేసింది. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన జానీ పాషా ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్‌లో బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు నుండి స్పిరిట్ తెప్పించి హైదరాబాద్ శివారులో కల్తీ మద్యం తయారు మొదలుపెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ దందాను కొనసాగిస్తున్నారు.
నిందితులు కల్తీ మద్యం తయారీకి బ్రాండెడ్ కంపెనీలను ఎంచుకుంటున్నారు. ముందు వైన్స్, బార్ల నుంచి బ్లెండర్స్ ప్రైడ్, టీచర్స్, బ్లాక్ లేబుల్, జానీవాకర్, బ్లాక్‌డాగ్ వంటి ఖరీదైన బాటిళ్లను సేకరిస్తున్నారు. వాటిల్లో కొంత మేర మద్యాన్ని తీసి ఆ ప్లేస్‌ను కర్ణాటక నుంచి తెప్పించిన ఆర్డినరీ లిక్కర్‌తో నింపేస్తున్నారు. కలర్‌లో తేడా రాకుండా వాటర్, స్పిరిట్ మిక్స్ చేస్తున్నారు. బాటిళ్లపై మూతలను తొలగించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎక్స్‌పర్ట్స్‌ను తీసుకొచ్చి పని చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చిన సీల్ అలాగే ఉన్నా.. లోపల మందు మాత్రం కల్తీ అవుతోంది. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని చండూరు, నాంపల్లి, మునుగోడు ప్రాంతాల్లోని వైన్స్, బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
ఈ కల్తీ మద్యం తయారీ వెనుకు పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈజీ మనీ కోసం ఓ పథకం వేశారు. ఇందుకోసం జానీ పాషాకు పరిచయమున్న చండూరుకు చెందిన ఎర్రజెల్ల రమేశ్, దోమలపల్లి యాదగిరి, సాయం ఉపేంద్ర, కనగల్ మండలం ఎడవెల్లికి చెందిన బొమ్మ రాబోయిన భార్గవ్, కస్తాలకు చెందిన జాల వెంకటేష్ యాదవ్ లతో మాట్లాడి ముఠాగా ఏర్పడ్డారు. ఆరు నెలల క్రితం శ్రీనివాస గౌడ్.. జానీ పాషా కు ఫోన్ చేసి రానున్న ఎన్నికల్లో నకిలీ మద్యాన్ని తయారు చేసి సొమ్ము చేసుకోవాలని పథకాన్ని చెప్పాడు. ముందస్తుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల రూపాయలు విలువైన కల్తీ మద్యాన్ని తయారుచేసి ఇస్తానని శ్రీనివాస్ గౌడ్ ఈ ముఠాకి చెప్పాడు. దీనికి అంగీకరించిన జానీ పాషా, యాదగిరి, రమేష్ లు ఆరు లక్షల రూపాయలు శ్రీనివాస్ గౌడ్‌కు ముట్టచెప్పారు. నాంపల్లి మండలం గానుగుపల్లిలోని రమేష్ తోటలో కల్తీ మద్యాన్ని తయారు చేయాలని నిర్ణయించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ముఠా బెంగళూరు నుండి ఐదు డ్రమ్ముల్లో స్పిరిట్ ను గానుగపల్లిలోని తోటకు తరలించారు. పది లీటర్ల క్వాంటిటీ కలిగిన 40 బిస్లెరి వాటర్ బాటిల్స్, మూడు ఫ్లవర్స్ కలిగిన లిక్విడ్ ను రెండు స్పిరిట్ డ్రమ్ములలో కలిపి నకిలీ మద్యాన్ని తయారు చేశారు. 20 లీటర్ల పరిమాణం గల 40 బబుల్స్ లలో నింపారు. ఒక్కొక్క బబుల్ ను పదివేల రూపాయలకు అమ్మాలని శ్రీనివాస్ గౌడ్ ఈ ముఠాకు సూచించాడు. ఈ బబుల్స్ కు ప్యాకింగ్ సరిగ్గా లేకపోవడంతో మునుగోడు వైన్ షాప్ పార్టనర్ జాల వెంకటేష్ వీటిని కొనుగోలు చేసేందుకు నిరాకరించాడు. రమేశ్ అత్తగారి ఊరైన యడవెల్లికి చెందిన భార్గవ్ ను సంప్రదించగా, అతను పదివేల రూపాయలు ఇచ్చి 20 లీటర్ల నాలుగు బబుల్స్ ను కొనుగోలు చేశాడు. వీటిని స్థానిక బెల్టు షాపులకు అమ్మేందుకు ప్రయత్నించగా ప్యాకింగ్ సరిగ్గా లేదంటూ బెల్ట్ షాప్ నిర్వాహకులు కొనుగోలు చేయలేదు.
అయితే తాజాగా ఈ కల్తీ మద్యాన్ని జానీ పాషా ఆటో డ్రైవర్ సాయి చంద్ర తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. దీంతో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాపై కేసు నమోదు చేసి ఐదుగురు సభ్యులను అరెస్టు చేయగా, కీలక నిందితుడు శ్రీనివాస్ గౌడ్, దోమలపల్లి యాదగిరి పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుండి 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ నకిలీ మద్యాన్ని ప్రజలు తాగినట్లయితే ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
Also read
- Garuda Puranam: భర్తలు జాగ్రత్త.. మీ భార్యని ఇలా బాధపెడుతున్నారా.. గరుడ పురాణం ప్రకారం ఏఏ శిక్షలో తెలుసా..
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- తెలంగాణ: కాళ్ళ పారాణింకా ఆరనే లేదు.. 22 రోజులకే నవ వధువు మృతి!
- డెలివరీ అయిన మూడు రోజులకే వారి ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు.. టెక్ బిలియనీర్ భార్య సంచలనం!
- జిమ్ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్‌తో కొట్టి కొట్టి….