November 21, 2024
SGSTV NEWS
CrimeTrending

Telangana: పుట్టినరోజు వేడుకలకు హాజరైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా..!

హైదరాబాద్ శివారు పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్ తన పుట్టిన రోజు సందర్భంగా తోటి ఉద్యోగులతో పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీ హాజరైన అజయ్ అనే ఐటీ ఉద్యోగి స్విమ్మింగ్ పూల్‌లో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘన్‌పూర్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో అజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పుట్టినరోజు వేడులకు హాజరైన వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా కనిపించాడు. అతన్ని గుర్తించిన తోటి ఉద్యోగులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మాదాపూర్‌లోని ఎస్ టెక్నాలజీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్, తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఫామ్ హౌస్‌లోతోటి ఉద్యోగులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందులో 13 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు హాజరయ్యారు అర్ధరాత్రి వరకు పుట్టినరోజు పార్టీని చేసుకున్నారు. అంతే కాకుండా అనుమతి లేకుండా మద్యం పార్టీ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు దిగారు. అయితే ఈత రాని ఆజయ్‌ను తోటి ఉద్యోగులు స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేశారు. అతన్ని 45 నిమిషాలపాటు ఎవరు గమనించలేకపోయారు.

చివరికి నీటిలోనే మునిగిపోయి ఉన్న అజయ్‌ను గుర్తించిన మరికొందరు ఉద్యోగులు, వెంటనే బయటకు తీశారు. అపస్మారకస్థితికి చేరుకున్న ఆజయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్నేహితులు అజయ్ సమీప బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మేనమామ కిషోర్ ఫిర్యాదు మేరకు అజయ్ స్నేహితులు శ్రీకాంత్, రంజిత్ రెడ్డి, సాయికుమార్, ఫామ్ హౌస్ యజమాని వెంకటేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via