భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో మార్చి 10వ తేదీన జరిగిన మిర్చి దహనం కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. పినపాకలో సంచలనం సృష్టించిన ఈ కేసును వారం రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బాలకృష్ణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు వరుసకు మామ అల్లుళ్లు.
మంత్రాల చేస్తున్నాడని అనుమానం.. గ్రామంలో పెద్ద మనిషిగా ఎదుగుతూ పేరు వస్తుందనే అసూయ.. ఇవే ఆ రైతు కల్లంలోని 50 క్వింటాళ్ల మిర్చిని తగులబెట్టడానికి కారణమైంది. దీంతో ఆ రైతు అరుగాలం పండించిన పంట బూడదైంది. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పినపాక మండలం వెంకట్రావుపేట మిర్చి దహనం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మంత్రాలు చేపిస్తున్నాడని నెపంతో మిర్చి దగ్ధం చేశామంటూ నిందితులు పోలీసుల ముందు ఒప్పేకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో మార్చి 10వ తేదీన జరిగిన మిర్చి దహనం కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. పినపాకలో సంచలనం సృష్టించిన ఈ కేసును వారం రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బాలకృష్ణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు వరుసకు మామ అల్లుళ్లు. వీరికి మిర్చి రైతు పురుషోత్తంకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో గత సంవత్సరం బాలకృష్ణ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దానికి ప్రధాన కారణం పురుషోత్తమే అని, అతను మంత్రాలు, చేతబడి చేయించచడం మూలంగానే తన భార్య చనిపోయిందని కక్ష పెంచుకున్నాడు బాలకృష్ణ. తన మామ అయిన వెంకటేశ్వర్లు తో విషయం చెప్పగా, తన ఎదుగుదలకు కూడా పురుషోత్తం అడ్డువస్తున్నాడని వెంకటేశ్వర్లు తెలిపాడు. ఇరువురు కలిసి ఎలాగైనా పురుషోత్తం పై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 10వ తారీఖున పురుషోత్తంకు చెందిన కల్లంలో ఆరబెట్టిన సుమారు 50 క్వింటాల మిర్చిని పెట్రోల్ పోసి దహనం చేశారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రాలు చేయిస్తున్నాడనే నెపంతోనే ఇద్దరు నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఏడూళ్ల బయ్యారం ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!