రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికిగల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అందులో నలుగురు యువకులు కాగా మరొక యువతి ఉంది. నలుగురు యువకులు కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. యువతి సూర్యాపేట జిల్లా వాసిగా గుర్తించారు. శనివారం వీకెండ్ కావడంతో ఒకే కారులో శంషాబాద్ వైపు వెళ్లిన వీరంతా తిరిగి తెల్లవారుఝామున గచ్చిబౌలి వస్తున్న సమయంలో డివైడర్ని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో గౌతమ్, ఆనంద్ ఇద్దరు చనిపోగా.. ముగ్గురు శంషాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్గా గుర్తించారు. పోలీసులు ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇబ్రహీంపట్నం రహదారిపై రెండు కార్లు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఇలా నగర శివారులో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతివేగం కారణంగానే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో ఆరు మంది మృతి చెందారు. నగర శివారులో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అతివేగంతో ప్రాణాలను కోల్పోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025