SGSTV NEWS
CrimeTelangana

నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..! ఏం జరిగిందో..?



రాత్రి పూట నడి వీధిలో తలపై సుత్తితో కొట్టడంతో బలమైన గాయాలతో అక్కడే మృతి చెందాడు విశ్రాంత ఉద్యోగి రామమోహన్ రావు. రాంమోహన్ రావు సింగరేణి విశ్రాంతి ఉద్యోగి. సింగరేణి కార్మికుని విచక్షణారహితంగా సుత్తితో కొట్టి చంపిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు. భయబ్రాంతులైన స్థానికులు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టిన కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్, సీఐలు. సంఘటన స్థలానికి చేరుకున్న డాగ్ స్కాడ్. హత్యకి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది.
నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..! ఏం జరిగిందో..?


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి మరీ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సింగరేణి విశ్రాంత ఉద్యోగిని కిరాతకంగా హత్య చేశారు. మృతుడిని కొత్తగూడెం 3 టౌన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో గుబ్బల రామ్మోహన్ రావుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 3 టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న గుబ్బల రామ్మోహన్ రావు (60) సింగరేణి విశ్రాంత ఉద్యోగి. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో ఆయన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ సోమవారం (సెప్టెంబర్ 22) రాత్రి రామ్మోహన్‌ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. అనంతరం రామ్మోహన్ రావుపై దాడి చేసి, ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి సుత్తితో తలపై దాడి చేశారు. ఈ దాడిలో రామ్మోహన్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అరుపులకు బయటకు వచ్చిన స్థానికులు అక్కడి దృశ్యం చూసి భయభ్రాంతులకు గురయ్యారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ నేతృత్వంలో త్రీ టౌన్ పోలీసులు ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. నిందితుల కోసం సీసీ ఫుటేజ్ ఆధారాలను సేకరిస్తున్నారు. హంతకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ దారుణ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also read

Related posts