అంతా ముసుగులు వేసుకున్నారు.. చేతుల్లో కత్తులు ఇంకా చాలా మారణాయుధాలు ఉన్నాయి.. అర్థరాత్రి సడెన్ గా కాలనీలోకి ఎంట్రీ ఇచ్చారు.. కట్ చేస్తే.. ఆరు ఇళ్లల్లోని బంగారం, వెంబడి ఆభరణాలు.. సహా నగదు మాయం అయింది.. మారణాయుధాలతో దొంగల బీభత్సం సృష్టించిన ఘటన ఖమ్మం నగరంలోని YSR కాలనీలో చోటుచేసుకుంది. అర్థరాత్రి వరుసగా ఆరు ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. బంగారు ఆభరణాలు, వెండి, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.. పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి మరీ దొంగలు చోరీ చేశారు. 8మంది ముఠాగా వచ్చిన దొంగలు.. వరుసగా ఇళ్లల్లో దోపిడికి పాల్పడ్డారు. పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లోనూ దొంగతనం చేశారు. సీసీ కెమెరాలు, ఇంట్లో మనుషులు ఉన్నా.. సైలెంట్‌గా దోపిడీ చేశారని స్థానికులు తెలిపారు.
కత్తులు పట్టుకుని ముసుగులు ధరించారని.. తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారని స్థానికులు తెలిపారు. అయితే.. చోరీ చేసిన కొన్ని వస్తువులను దొంగలు బయట పడేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. అయితే.. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు చూసి.. ఖమ్మం నగరం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నాయి.
Also read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





