అందరూ పనోళ్లు ఒకలా ఉండరు. ఇలాంటి బ్లడీ బ్యాచ్ వల్ల.. నిజాయితీగా పని చేసవాళ్లను కూడా అనుమానించే పరిస్ధితి దాపురించింది. అందుకే ఎవరైనాన పనిలో పెట్టుకునే ముందు వారి ఆధార్, పాన్ కార్డ్ సహా అన్ని వివరాలను పోలీసులకు అందించాలి. అప్పుడు ఇలాంటి నేరాలకు అవకాశం ఉండదు. తోక జాడిస్తే ఠాణాలో కోదండం.. జైలులో బాసింగం తప్పదని భయం వుంటుంది..!
తిన్నమా..పన్నామా.. లేచామా! అన్నంత ఈజీగా.. వచ్చామా.. చంపమా..దోచుకెళ్లామా అన్నట్టు నేరాలకు పాల్పడుతున్నారు అంతర్ రాష్ట్ర కేటుగాళ్లు. పాపమని పని ఇచ్చి ఆదరిస్తే, మనీ కోసం తిన్నంటి వాసాలను లెక్కపెట్టడమే కాదు. ఏకంగా హత్యలకు తెగపడున్నారు. అలా తెగపడిన రాంచీ గ్యాంగ్‌కు చెక్ పెట్టారు సైబరాబాద్ పోలీసులు. కూకట్‌పల్లి రేణు మర్డర్ కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగు చూశాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హౌస్ కీపర్స్.. గంజాయి ఎంజాయ్‌మెంట్ యాంగిల్ డేంజర్ బెల్ మోగిస్తోంది.
హర్ష, రోషన్ ఇద్దరూ జార్ఖండ్‌లోని రాంచీకి చెందినవాళ్లు. ఉపాధి కోసం కోల్‌కతాకు చెందిన ఓ ఏజెన్సీని సంప్రదించారు. ఈ క్రమంలోనే ఒకరు రేణు అగర్వాల్ ఇంట్లో.. మరొకరు వాళ్ల బంధువుల ఇంట్లో పని మనుషులుగా సెటిల్ అయ్యారు. మార్వాడి కుటుంబం కదా.. బంగారం పెద్ద మొత్తంలో ఉంటుందని భావించి.. దాన్నంతా కొట్టేయాలని స్కెచ్ వేశారు. వారం పది రోజులుగా రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు..? ఎప్పుడు వెళ్లిపోతున్నారు..? ఏ టైమ్‌లో ఒంటరిగా ఉంటున్నారు..? ఇలా ప్రతీది గమనించి అదను చూసి రేణు అగర్వాల్‌ను హత్య చేశారు. చేతికందిన క్యాష్ సహా 7 తులాల నగలతో ఉడాయించారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్లు గురి పెట్టింది కేజీ బంగారం ఎత్తుకెళ్లాలని.. కానీ వన్ గ్రామ్ రోల్డ్ గోల్డ్‌ను చూసి అదే అసులు బంగారం అనకుని ఇంత అఘాయిత్యానికి తెగించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
రేణు అగర్వాల్‌ను హత్య చేశాక.. నెత్తురంటిన బట్టఅలను అక్కడే వదిలేశారు. నింపాదిగా స్నానం చేసి.. దోచుకున్న సొత్తును బ్యాంగ్‌లో సర్దుకుని.. ముచ్చుటు పెట్టుకున్నారు. హత్య చేశామనే భయం కానీ.. దొరికిపోతామనే టెన్షన్ కానీ ఏమాత్రం లేదు. బిందాస్‌గా ఓనర్ స్కూటీపైనే ఉడాయించారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు హర్ష, రోషన్‌ల కదలికలను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ట్రాక్ చేశారు. స్కూటీ రైల్వేస్టేషన్ దగ్గర కనిపించడంతో నిందితులు.. ట్రైన్‌లో పారిపోయి ఉంటారని అనే కోణంలో ఎంక్వయిరీ చేపట్టారు. కానీ సినీ ఫక్కీలో ఖాకీలకే మస్కా కొట్టే స్కెచ్చేశారు ఈ కేటుగాళ్లు. క్యాబ్ ఎంగేజ్ చేసుకుని జార్ఞండ్‌కు చెక్కేశారు. టెక్నో పోలీసింగ్‌తో పాటు క్యాబ్ డ్రైవర్, ఓనర్ ఇచ్చిన ఇన్ఫోతో డామిట్‌గాళ్ల కథ అడ్డం తిరిగింది.
నిందితులు చేసిన రీల్సే.. వాళ్ల భరతం పట్టించాయి. ఆ రీల్స్‌ను చూసిన క్యాబ్ డ్రైవర్ అతని ఓనర్‌కు సమాచారం ఇవ్వడం.. అతను పోలీసులకు ఇన్‌ఫర్మ్ చేయడంతో కేటుగాళ్లను క్యాచ్ చేయడం ఈజీ అయిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. అసలు వీళ్లకు దోపిడీ ఐడియా ఎలా వచ్చింది? హత్యకు మందు గంజాయి తీసుకున్నారా? పార్టీ చేసుకుని దోపిడీకి, హత్యకు స్కెచ్చేశారా? పనిలో చేరిన పది రోజుల్లోనే హర్ష ఇంత దారుణానికి పాల్పడిన హర్షకు మరెవరైనా సాయం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అలా సేఫ్‌గా రాంచీకి చేరుకున్నారు కేటుగాళ్లు. దోచుకెళ్లిన నగల్లో రోల్డ్ గోల్డ్ ఎక్కువ అని తేలినా.. అసులు గోల్డ్ 7 తులాల్లో కొంత అమ్మేశారు. తమను ఎవరూ పట్టుకోలేరని కాలర్ ఎగరేశారు. కానీ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కూపీలాగితే డ్రగ్ లింక్ కూడా బయటపడింది. గంజాయి మత్తులో హర్ష.. నేరాలకు అలవాటు పడిన రోషన్.. ఇద్దరు కలిసి నీడనిచ్చిన ఓనర్‌ను దారుణంగా చంపేశారు. హౌస్ కీపర్స్‌గా జాయినై.. ఇలాంటి నేరాలకు పాల్పడ్డం ఇటీవల పరిపాటిగా మారింది. ఆ మధ్య కాచిగూడలో నేపాల్ కపుల్.. వృద్ధ దంపతులు మత్తు మందు ఇచ్చి ఇల్లు దోచుకెళ్లారు. హౌస్ కీపర్స్‌ను పనిలో పెట్టుకునే ముందు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో వారి సమాచారం ఇవ్వాలని సూచించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతి.
అది సంగతి. అందరూ పనోళ్లు ఒకలా ఉండరు. ఇలాంటి బ్లడీ బ్యాచ్ వల్ల.. నిజాయితీగా పని చేసవాళ్లను కూడా అనుమానించే పరిస్ధితి దాపురించింది. అందుకే ఎవరైనాన పనిలో పెట్టుకునే ముందు వారి ఆధార్, పాన్ కార్డ్ సహా అన్ని వివరాలను పోలీసులకు అందించాలి. అప్పుడు ఇలాంటి నేరాలకు అవకాశం ఉండదు. తోక జాడిస్తే ఠాణాలో కోదండం.. జైలులో బాసింగం తప్పదని భయం వుంటుంది..!
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు