SGSTV NEWS
CrimeTelangana

Telangana: తెల్లారి మొబైల్ స్టోర్‌కు ఒక్కసారిగా క్యూ కట్టారు.. లోపల కనిపించిన సీన్ చూసేసరికి

 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనమంతా ఉలిక్కిపడే విచిత్ర సంఘటన జరిగింది.. ఓ వ్యక్తిపై పగతో రగిలిపోతున్న గుర్తు తెలియని వ్యక్తులు గత అమావాస్యకు షాప్ ముందు క్షుద్ర పూజలు నిర్వహించారు.. షాప్ బాగా నడుస్తుందనే కారణంతో అతని పతనం కోరి క్షుద్రపూజల తో తీవ్ర భయాందోళన సృష్టించారు.

మహబూబాబాద్ పట్టణమంతా ఉలిక్కిపడే ఈ విచిత్ర సంఘటన.. జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్‌లో కలకలం రేపింది. నిత్యం కస్టమర్స్‌తో రద్దీగా ఉండే మణి మొబైల్స్‌లో అగ్నిప్రమాదం చెలరేగి షాప్ అంతా దగ్ధమైంది. అందులోని విలువైన మొబైల్స్, మొబైల్ పరికరాలు, రిపేర్ కోసం ఇచ్చిన సెల్ ఫోన్లు కాలి బూడిదయ్యాయి. అగ్నికి ఆహుతైన షాపును చూసి షాప్ యజమాని శ్రీధర్‌తో సహా కుటుంబసభ్యులంతా బోరున విలపిస్తున్నారు. అయితే సరిగ్గా అమావాస్య రోజే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని అంతా అనుమానిస్తున్నారు. నెహ్రూ సెంటర్‌లో నిత్యం రద్దీగా ఉండే ఈ మొబైల్ షాప్ బాగా నడుస్తుందని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షాపు యజమాని శ్రీధర్‌పై ఈర్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


సరిగ్గా నెల రోజుల క్రితం అమావాస్య రోజే షాప్ ముందు క్షుద్రపూజలు జరిగాయి. గుర్తుతెలియని మహిళ ఎక్కడో పూజలు నిర్వహించి ఆ పూజా సామగ్రి తీసుకొచ్చి షాప్ ముందు దిష్టితీసి వదిలేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఆ క్షుద్రపూజలను లైట్ తీసుకున్న షాప్ యాజమాని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెల తిరక్కముందే అతని జీవనోపాధి మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. గత అమావాస్య రోజు క్షుద్రపూజలు కలకలం రేపగా.. ఈ అమావాస్య రోజు షాప్ పూర్తిగా దగ్ధమవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. క్షుద్రపూజలు నిర్వహించిన ఆ దుండగులే షాప్ దగ్ధం చేశారా..! లేక ప్రమాదవశాత్తు షాపులో మంటలు చిలరేగి పూర్తిగా దగ్ధమైందా..! లేక క్షుద్రపూజల ప్రభావంతో అందులో ఏమైనా మంటలు చెలరేగాయా..! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అన్నంపెట్టే దుకాణం దగ్ధమై రోడ్డున పడ్డ వ్యాపారి కుటుంబం కుమిలిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే తన షాప్ బాగా నడుస్తుందనే కారణంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనపై ఈర్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు

Also read

Related posts