పైన పేర్కొన్న ఫోటోలోని వ్యక్తిని చూసి బుద్దిమంతుడులా ఉన్నాడని అనుకునేరు.. పక్కా 420 పనులు చేస్తాడు. అసలు ఏం చేశాడో తెలిస్తే మీరూ మండిపోవడం ఖాయం. ఓ బాలిక ఇంటికి వెళ్లి.. ఆ తర్వాత ఏం చేశాడంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రేమ,పెళ్లి అంటూ పోకిరి పెట్టిన వేధింపులతో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో ఆ యువతిని కొన్ని రోజులుగా అసభ్యకర సైగలతో వేధించాడు. ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక.. తమ కుమార్తె మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు అన్నారు.
ఆ యువకుడిపై మైనర్ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఐటీఐ చదివి రెండేళ్లుగా ఖాళీగా తిరుగుతున్న అనిల్ అనే యువకుడు యువతితో పరిచయం పెంచుకొని.. రెండు రోజుల క్రితం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. తల్లిదండ్రులు అడ్డుకుని యువకుడిని మందలించారు. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన యువకుడిపై ఫోక్సో, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





