రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ రాజయ్య అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. మానేరు వాగు నీటిలో చాకలి రాజయ్య మృతదేహం లభించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో పోలీసులు పంట పొలాల్లోని పేకాట స్థావరంపై గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం దాడి చేశారు. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళగా పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఐదుగురు పరిగెత్తుతుండగా వారిని పంట పొలాల వెంట వెంబడించారు. పోలీసులు వెంబడించడంతో వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకలి రాజయ్య పక్కనే ఉన్న మానేరు వాగు చెక్ డ్యాం నీటిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. మిగతా నలుగురు తప్పించుకున్నారు.
అయితే రాత్రి అయినా రాజయ్య ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. ఫోన్ చేసిన స్పందించకపోవడం కుటుంబ సభ్యులు మానేరు వాగు పక్కన ఉన్న పొలం వద్ద వెతికారు. మానేరు వాగులో రాజయ్య అనుమానాస్పదంగా పడి ఉండడం గమనించారు. పోలీసులు వెంబడించి చంపారా.. ఎవరైనా కొట్టి చంపి పడేశారా.. అనే అనుమానాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు.మానేరు వాగులో పడి ఉన్న రాజయ్య మృతదేహాన్ని స్థానికులు పంట పొలాల వెంబడి ఎత్తుకుని రోడ్డుకు తీసుకొచ్చారు. రాజయ్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేట-సిరిసిల్ల ప్రధాన రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also read
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!