November 21, 2024
SGSTV NEWS
CrimeLok Sabha 2024Telangana

లోక్ సభ ఎలక్షన్ 2024: ముస్లిం మహిళల బురఖా తొలగించి తనిఖీ.. మాధవి లతపై కేసు నమోదు

హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవి లతపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్‌లు 171 సి, 186, 505 (1) (సి) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద నమోదైంది. మాధవి లత పోలింగ్ బూత్‌కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్‌ బూత్‌లో ఉన్న ముస్లిం మహిళలను బురఖా తొలగించాలని కోరడం, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు తమ గుర్తింపు కార్డలను కూడా బయటపెట్టాలని ఆమె కోరుతోంది. ఈ విషయంపై ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో మాధవి లతపై కేసు నమోదు చేయాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పోలీసులను ఆదేశించారు. దీంతో మలక్ పేట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.



కాగా, ఈ విషయానికి సంబంధించి, బీజేపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ, ముస్లిం మహిళలు తమ గుర్తింపును ధృవీకరించమని అభ్యర్థించారని, అలా చేయడం తప్పు కాదన్నారు. ఎన్నికల అభ్యర్థినని, ముఖానికి ముసుగు లేకుండా ఓటరు గుర్తింపు కార్డును తనిఖీ చేసే పూర్తి హక్కు చట్టపరంగా అభ్యర్థికి ఉందని మాధవి చెప్పారు.నేను పురుషుడిని కాదు, స్త్రీని, వారి గుర్తింపును వెల్లడించమని మర్యాదపూర్వకంగా ఆ మహిళలను అభ్యర్థించానని మాధవి లత తెలిపారు. ఎవరైనా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారనుకుంటే భయపడేదీలేదన్నారు.

గతంలో మాధవి లత తన నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తేడాలున్నాయని ఆరోపించారు. పోలీసు సిబ్బంది చురుగ్గా లేరని, విచారణ చేయడం లేదని మాధవి లత అన్నారు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడికి వస్తున్నప్పటికీ వారి పేర్లను జాబితా నుంచి తొలగించారన్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఇలా చేయాల్సి వచ్చిందన్నారు మాధవి లత.

Also read

Related posts

Share via