ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు.. 40 ఏళ్లుగా నరకం చూస్తున్నాడు. కండరాల క్షీణత వ్యాధిగ్రస్తుడు ఆరు లక్షల్లో ఒకరికి ఇలాంటి వ్యాధి సోకుతుంది. ఇప్పటికి వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు. ఆత్మవిశ్వాసం, యోగాతోనే ఇన్నేళ్లు బతికి బయటపడ్డాడు. అయితే ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించుకపోవడంతో తనకు చావడానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశాడు.
ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు.. 40 ఏళ్లుగా నరకం చూస్తున్నాడు. కండరాల క్షీణత వ్యాధిగ్రస్తుడు ఆరు లక్షల్లో ఒకరికి ఇలాంటి వ్యాధి సోకుతుంది. ఇప్పటికి వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు. ఆత్మవిశ్వాసం, యోగాతోనే ఇన్నేళ్లు బతికి బయటపడ్డాడు. అయితే ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించుకపోవడంతో తనకు చావడానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశాడు. కనీసం చనిపోదామన్నా కూడా అతని చేతులు పైకి లేవవు. శరీరం కదలదు. అందుకోసమే మెర్సి కిల్లింగ్ కావాలంటున్నాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాపువాడకు చెందిన కట్ల శ్రీనివాస్ 16వ ఏటనే కండరాల క్షీణత వ్యాధి సోకింది. ఆ సమయంలో తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎన్ని ఆసుపత్రులు తిరిగిన రోగం నయం కాలేదు. చివరకు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అతనికి కండరాల క్షీణత వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఈ వ్యాధి లక్షణం శరీరం అంత చచ్చుబడిపోతుంది. శరీరంలోని గుజ్జు పనికి రాకుండా పోతుంది. కనీసం కాలు తీసి కాలు లేపిన విపరీతమైన నొప్పి ఉంటుంది.
శ్రీనివాస్ యోగాతో పాటు ఆత్మవిశ్వాసంతో ఇన్ని రోజులు జీవితాన్ని నెట్టుకొచ్చాడు. ఇప్పుడు ఓవైపు వయసు పెరగడంతో పాటు మరోవైపు శరీరం సహకరించడం లేదు. కనీసం ఒక ఇంచు కూడా కాలు ముందుకు కదలడం లేదు. కొద్దిగా కదిలిన విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడు. గ్లాసు తీసుకొని మంచినీళ్లు తాగలేడు. చేయిని పైకి ఎత్తలేడు. దాదాపు శరీరం మొత్తం కూడా చచ్చుబడిపోయింది. ఇక తనకు మెరుగైన వైద్యం దొరకదని చావే మార్గమని భావించాడు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టుతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాడు.
మెర్సి కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీనివాస్ వేడుకుంటున్నాడు. ఇప్పుడు తీవ్రమైన చలి కారణంగా శరీరం మొత్తం దగ్గరికి వస్తుంది. 24 గంటల పాటు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ క్రమంలోనే తను ఈ భూమిపై ఉండలేనంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నాడు. చనిపోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. వృద్ధాప్యంతో బాధపడుతున్న తల్లి ఉంది. తండ్రి చనిపోయాడు. తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో తనకు సేవ చేసేవారు ఎవరూ లేరని చిన్న మెడిసిన్ కొనుక్కుందామన్న చిల్లి గవ్వలేదని ఆవేదన చెందుతున్నాడు. అటు సుప్రీంకోర్టు ఇటు ప్రధానమంత్రి స్పందించి మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నాడు.
40 ఏళ్లుగా ఏదో విధంగా బతికానని ఇక తనను తాను బతకడం కష్టమని కట్ల శ్రీనివాస్ చెబుతున్నాడు. విపరీతమైన నొప్పులతో తట్టుకోలేకపోతున్నానని అంటున్నారు. మెర్సి కిల్లింగ్ కు అనుమతిస్తే వెంటనే తనువు చాలిస్తానని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నానని అంటున్నారు
Also Read
- మార్గశిర మాసం.. ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేస్తే.. ఇంట్లో కనక వర్షం కురిసినట్టే..
- నేటి జాతకములు…22 నవంబర్, 2025
- అలసిపోయాను.. చావడానికి అనుమతి ఇవ్వండి.. సుప్రీంకోర్టు, పీఎంవోకు లేఖ!
- Hyderabad: 24 గంటల్లో డెలివరీ.. హాస్పిటల్కు వచ్చిన గర్భిణి మిస్సింగ్.. ఇక్కడే అసలు ట్విస్ట్
- హైదరాబాద్లో విషాదం.. లిఫ్టులో ఇరుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!





