ప్రసవం కోసం అస్పత్రికొచ్చింది ఓ మహిళ.. పాపం.! డాక్టర్లు చేసిన పనికి తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఈ ఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. మరి డాక్టర్లు ఏం చేశారు.. చివరికి ఏం జరిగిందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వాస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. ఓ మహిళకు ప్రసవం చేసే సమయంలో ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం తిరుమల అనే మహిళకు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు కమలాపూర్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు. ఆ సమయంలో కడుపులో కాటన్ క్లాత్ వదిలేసి కుట్లు వేశారు. దీంతో సదరు మహిళ తీవ్ర అనారోగ్యానికి లోనైంది. విపరీతమైన కడుపునొప్పితో ఇబ్బందులు పడింది. దీంతో చేసేదేమీలేక మరోసారి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కాస్త బయటపడింది.
ఇక అది కప్పిపుచ్చుకునేందుకు.. సదరు మహిళ ఆస్పత్రిలో రీ-అడ్మిట్ అయిన సమయంలో విధుల్లో ఉన్న నర్సుకు ఫోన్ చేసి.. ఆ క్లాత్ ఎలా తీయాలో వైద్యురాలు వివరించింది. ఇక దాన్ని తీసే క్రమంలో బాలింతకు వేసిన కుట్లు ఊడిపోవడంతో.. ఆమెకు రక్తస్రావం అవ్వడమే కాదు.. తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకొని బాధితులకు, వైద్యులకు మధ్య సంధి కుదిర్చి పంపించారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





