April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Khammam: రేగి పండు మింగిన చిన్నారి.. గొంతులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి.. ఆ తర్వాత..



చిన్న పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో తెలీదు. తెలియక వారు ప్రమాదాలు తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తూ అవి గొంతులో ఇరుక్కోవడం..లేదా లోపలికి మింగడం జరుగుతూ ఉంటుంది..తల్లి తండ్రులు వారిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాపాయం సంభవించవచ్చు.


తాజాాగా ఖమ్మం జిల్లాలో ఓ పాప ఆడుకుంటూ పెద్ద సైజ్ రేగి కాయను మింగింది.  కామేపల్లి మండలం ఊట్కూర్ గ్రామానికి చెందిన అఫ్సర్, రిజ్వానా దంపతుల 19 నెలల పాప ఆడుకుంటూ పెద్ద సైజులో ఉన్న రేగి కాయ మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న పాపను వెంటనే ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడముతో అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని డాక్టర్ జంగాల సునీల్ కుమార్ దగ్గరకు తీసుకొచ్చిన పాప తల్లిదండ్రులు. పిల్లలు ఏదైనా వస్తువులు మింగితే వాటిని ఆపరేషన్ లేకుండా బయటకు తీయడంలో ఎక్సపర్ట్ అయిన డాక్టర్ జంగాల సునీల్ పాప గొంతులోని రేగి కాయను ఎండోస్కోపీ ద్వారా ఎలాంటి ఆపరేషన్ లేకుండా బయటకు తీసి పాప ప్రాణాలు కాపాడాడు. చావు బతుకుల మధ్య ఉన్న పాపను కాపాడిన డాక్టర్‌కు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.



ఈ మధ్య కొందరు పేరెంట్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పసిబిడ్డల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. బిడ్డల్ని కంటిపాపల మాదిరికి ఎప్పడూ కాపు కాస్తూ ఉండాలి. వారికి ఏది మంచి.. ఏది చెడు.. అనేది వివరిస్తూ లేదండి. లేని పక్షంలో వారి జీవితాలు రిస్కులో పడే అవకాశం ఉంది

Also read

Related posts

Share via