హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.. దురదృష్టవశాత్తూ చెరువులో పడి ఇద్దరు మరణించారు. ప్రమాదవశాత్తు 11 సంవత్సరాల బాలిక చెరువులో పడిపోయింది.. ఆమెను కాపాడేందుకు మరో యువకుడు వెళ్లాడు.. ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందాడు.. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని అనాజ్పూర్ చెరువు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందినటువంటి చిన్నపురెడ్డి ప్రతాపరెడ్డి తన కుటుంబ సభ్యులతో అబ్దుల్లాపూర్మెట్లో నివాసం ఉంటున్నాడు.. వీళ్ళ బంధువులకు టిప్పర్లు ఉండడంతో అనాజ్పూర్ గ్రామంలో ప్రైవేట్ వెంచర్ల నిర్మాణం పనులను నడిపిస్తున్నారు. అక్కడే పని చేస్తున్నటువంటి ప్రతాప్ రెడ్డి.. ఆదివారం సెలవు కావడంతో కూతురు ప్రణీతతో కలిసి ఆ చెరువు వద్దకు వెళ్లాడు.. ప్రతాప్ రెడ్డి, కూతురు ప్రణీతతోపాటు బంధువు అయినటువంటి ఇంద్రసేనారెడ్డి (20) అనే యువకుడు కూడా వారి వెంట వెళ్లారు.. అక్కడ ఒక వెంచర్ ఉండగా సమీపంలోనే ఇందిరా సాగర్ ఉంది. ఆ సమీపంలో ఆడుకునేందుకు వెళ్లినటువంటి ప్రణీత.. అలాగే కుటుంబ సభ్యులు కాసేపు సంతోషంగా ఫోటోలు దిగారు..
అదే సమయంలో ఒక్కసారిగా మృత్యువు ముంచుకొచ్చినట్లుగా ప్రణీత చెరువులో పడిపోయింది.. దీంతో అది చూసినటువంటి ఇంద్రసేనారెడ్డి ఒక్కసారిగా చిన్నారి ప్రణతను కాపాడేందుకు చెరువులోకి దూకాడు.. ఇద్దరూ కూడా నీటిలో మునిగగా.. ఈత రాకపోయినా కూతురు, అలాగే అతని బంధువును కాపాడేందుకు ప్రతాపరెడ్డి చెరువులోకి దూకాడు.. ఈ సమయంలో ఆయన కూడా మునిగిపోయాడు.. ఆ తర్వాత తన భార్య చీర కొంగు సహాయంతో బయటపడ్డాడు.. అప్పటికే నీట మునిగిన స్పృహతప్పి పడిపోయిన ప్రతాపరెడ్డిని బయటకు తీసి హాస్పటల్ కు తరలించారు..
అనంతరం ప్రణీత, ఇంద్రసేనారెడ్డి మృతదేహాలను బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025