SGSTV NEWS
CrimeTelangana

గొంతులో కత్తెరతో పొడిచి.. ఒంటిపై 20 కత్తిపోట్లు.. కూకట్‌పల్లి రేణు మర్డర్‌ కేసులో దారుణాలు!



కూకట్‌పల్లి రేణు అగర్వాల్ మర్డర్‌ కేసులో మరో షాకింగ్‌ విషయం కూడా వెల్లడైండి. రేణు అగర్వాల్‌ను కిరాతకంగా హత్య చేసిన హర్ష, రోషనల వయసు 20 సంవత్సరాలుగా గుర్తింపు. మృతురాలి శరీరంపై 20కు పైగా కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం..


హైదరాబాద్‌, అక్టోబర్‌ 11: కూకట్‌పల్లి రేణు అగర్వాల్ (50) మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఇంట్లో పని చేసే హర్ష, పక్క ఇంట్లో పని చేసే రోషన్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫింగర్ ఫ్రింట్స్ మ్యాచ్ అవ్వడంతో ఆ ఇద్దరే హత్య చేసినట్లు నిర్ధారణ. లాకర్ వివరాలు చెప్పకపోవడంతో రేణు అగర్వాల్ ను హర్ష చిత్రహింసలకు గురి చేశాడు. మరోవైపు ఇంట్లో ఎలాంటి బంగారం పోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. రేణు ఆగర్వాల్ ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే నిందితులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇదే ఇంట్లో పనిచేయటంతో పాటు ఇక్కడే నివాసం ఉంటున్న హర్ష, రోషన్. వీరికి 15వేల రూపాయల జీతం ఇస్తున్నట్టు గుర్తింపు. హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు, నిందితులు ఇంట్లో వదిలేసిన రక్తపు మరకలతో ఉన్న బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కూకట్‌పల్లి రేణు అగర్వాల్ మర్డర్‌ కేసులో మరో షాకింగ్‌ విషయం కూడా వెల్లడైండి. రేణు అగర్వాల్‌ను కిరాతకంగా హత్య చేసిన హర్ష, రోషనల వయసు 20 సంవత్సరాలుగా గుర్తింపు. మృతురాలి శరీరంపై 20కు పైగా కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం రేణు అగర్వాల్ ఒంటి మీద బంగారం ఎత్తుకెళ్లారు. మొత్తం 50 వేల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రేణు అగర్వాల్ అరవకుండా ఆమె గొంతులో హర్ష కత్తెరతో పొడిచినట్లు గుర్తించారు. మొత్తం రెండు కత్తులను హత్యకు నిందితులు ఉపయోగించారు. హత్య చేసిన 2 కత్తులు, కత్తెర, కుక్కర్, రక్తపు బట్టలను పోలీసులు సీజ్ చేశారు.

కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి కేసు వివరాలు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘స్పాన్ లేక్ రేణు అగర్వాల్ హత్య కేసులో ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. జార్ఖండ్ కు సైతం ఒక బృందాన్ని పంపించాం. కూకట్‌పల్లి నుంచి మాదాపూర్ వైపు టూ వీలర్ మీద వెళ్లినట్టు గుర్తించాం. రేణు అగర్వాల్ ఇంట్లో 11 రోజులు పాటు చాలా నమ్మకంగా హర్ష పనిచేశాడు. హర్ష తో పాటు రోషన్ ఇద్దరు కూడా ఝార్ఖండ్ సంబంధించిన నిందితులు. వీరిని కోల్‌కతాలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీ ఏజెంట్ శంకర్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాదులో పనిలో ఉంచాడు. రేణు, రాకేష్ అగర్వాల్ కు సనత్ నగర్ లో స్టీల్ వ్యాపారం ఉంది. వీరు మార్వాడిస్ కావటంతో ఇంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది అని భావించి నిందితులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని’ ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు.

Also read

Related posts

Share this