హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు దగ్గర హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఓ మహిళ, పురుషుడు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఓ స్ట్రీట్ డాగ్ (వీధి కుక్క) కూడా చనిపోయింది. సాగర్ రింగు రోడ్డు దగ్గర ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగి మంటలు వచ్చాయి.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు దగ్గర హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఓ మహిళ, పురుషుడు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఓ స్ట్రీట్ డాగ్ (వీధి కుక్క) కూడా చనిపోయింది. సాగర్ రింగు రోడ్డు దగ్గర ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగి మంటలు వచ్చాయి. ఆ సమయంలో స్థానిక ఆలయం దగ్గర ఫుట్‌పాత్‌పై పడుకొని ఉన్న ఇద్దరు యాచకులు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు వద్ద ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఓ ఆలయం వద్ద పడుకొని ఉన్న ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని.. అధికారులు తెలిపారు. అదే సమయంలో వారికి కొద్ది దూరంలోని ఓ వీధి కుక్క కూడా విద్యుదాఘాతంతో మృతి చెందిందన్నారు. మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేసి, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇద్దరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా..? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతికి బాధ్యులన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Also read
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!
- వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..