వీకెండ్.. తెలంగాణ పోలీసులు పక్కాగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారు. ఎవరైనా మద్యం తాగి డ్రైవ్ చేసినట్లు తేలితే వారిపై పక్కాగా కేసు నమోదు చేస్తారు. వాహనాలు స్వాధీనం చేసుకుని.. తర్వాత కౌన్సిలింగ్‌కు రావాలని చెబుతారు. ఇదంతా ఎప్పుడూ జరిగే ప్రాసెస్. వారంతం కావడంతో శనివారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణ కోత్వాల్‌గూడ చెన్నమ్మ హోటల్ వద్ద ఔటర్ రింగురోడ్డు-సర్వీసు రోడ్డు పరిధిలో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఇంతలో ఓ కారు అటు వైపుగా వచ్చింది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తి కంగారు పడుతూ కనిపించాడు. టెస్టు చేయగా.. మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును పక్కకు తీసుకెళ్తుండగా… అతడు తత్తరపాటు గురవ్వడంతో.. పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే కారులో తనిఖీ చేయగా.. రెండు అనుమానాస్పద బ్యాగులు కనిపించాయి.
తొలుత ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు ఉంటుందేమో అనుకున్నారు. బ్యాగులు ఓపెన్ చేయగా.. గంజాయి గుప్పుమంది. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 50కిలోలుగా తేలింది. గంజాయిని.. సీజ్ చేసి.. తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి.. ఎక్కడికి తరలిస్తున్నారు?.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే వివరాల కోసం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..