విశాఖలో మురళీనగర్ ప్రాంతం.. మధ్యాహ్నం మూడు గంటల సమయం.. అన్ని వాహనాలు యధావిధిగా వెళుతున్నాయి. ఎవరి ప్రయాణంలో వాళ్ళు బిజీబిజీగా ఉన్నారు. ఇంతలో.. ఓ కారు అదే రోడ్డుపై వెళ్తూ.. వర్మ కాంప్లెక్స్ వద్ద ఒక్కసారిగా ఆగిపోయింది. నడిరోడ్డుపైన కదలకుండా ఉండిపోయింది. కారులోంచి ఎవరూ బయటకు దిగడం లేదు. ఎందుకు ఆగిపోయిందో జనాలకి తెలియలేదు. అటుగా వెళుతున్న ప్రయాణికులు.. వెళ్లి కారులో తొంగి చూశారు. ఓ వ్యక్తి ప్రమాదకర స్థితిలో ఉన్నాడు.
కారు నడుపుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయిన వ్యక్తిని కాపాడారు పోలీసులు. సపర్యలు చేసి సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. కంచరపాలెం ప్రాంతానికి చెందిన సత్యప్రసాద్.. కారులో బయలుదేరాడు. ఆ కారు బర్మా క్యాంపు ప్రాంతం వర్మ కాంప్లెక్స్ సమీపంలోకి వచ్చేసరికి అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కారు సడన్గా ఆగిపోయి.. కదలకుండా ఉండిపోయింది. కాసేపటి వరకు ఏమైందో తెలియక ఆందోళన చెందారు ప్రయాణికులు స్థానికులు. అటుగా వెళ్లే ప్రయాణికులు వెళ్లి కారు లోపలకు తొంగి చూసారు. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆ వ్యక్తి.. సిట్లోనే అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే డయాల్ 112 కు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. ఎస్సై రవికుమార్‌తో పాటు సిబ్బంది అక్కడకు వెళ్లి.. అపస్మారక స్థితిలో ఉన్న అతనికి కారు నుంచి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో తిరిగి కోలుకున్నాడు సత్య ప్రసాద్. లో బీపీ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాపార వ్యవహారాలు కారణంగా అలసిపోయి ఎండతో అపస్మారక స్థితి వెళ్ళినట్టు చెప్పారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులకు సిపి రవిశంకర్ అయ్యనార్ అభినందించారు
Also read
- Andhra: బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్…. M
- Telangana: భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..
- Crime: తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య
- Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!
- గుంటూరు: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే