March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

మెహిదీప‌ట్నంలో మంచినీళ్ల కోసం ఇద్దరి గొడవ.. కత్తితో పొడిచి పరార్‌!



మంచి నీళ్ల కోసమే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని మేథావులు అనేక మంది ఇప్పటికే పలుమార్లు ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అయితే ఇప్పటికే దేశంలో చాలా చోట్ల బావులు, చెరువులు, నదుల నీళ్లకు బదులు కొన్నవాటిని జనాలు వాడుతున్నారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడా మంచినీళ్లు దొరకని పరిస్థితి. తాజాగా మంచినీళ్ల కోసం ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. అది ముదిరి చివరకు కత్తులతో పొడుకునే వరకు వెళ్లింది..


హైదరాబాద్‌, ఫిబ్రవరి 14: చలికాలం ఇంకా ముగియక ముందే భానుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. పగటి పూటేకాకుండా రాత్రిళ్లు కూడా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. దీంతో జనాలు ఆచితూచి బయట అడుగుపెడుతున్నారు. మరికొంత మంది చల్లని ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. తాజాగా కూలి పనులకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాహంగా ఉండటంతో మంచి నీళ్ల కోసం గొడవపడ్డారు. ఈ గొడవ కాస్తా చిరిగి చిరిగి.. చివ‌రికి క‌త్తిపోట్లకు దారి తీసింది. ఈ దారుణ ఘ‌ట‌న హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలోని గుడిమ‌ల్కాపూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో గురువారం (ఫిబ్రవరి 13) రాత్రి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..


హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలోని గుడిమ‌ల్కాపూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబ‌ర్ 22 స‌మీపంలోని ఓ నిర్మాణ భ‌వ‌నంలో ప‌లు రాష్ట్రాల‌కు చెందిన కూలీలు పనుల నిమిత్తం వచ్చారు. వారంతా అక్కడే నివాసం ఉంటూ రోజూ కూలి పనులకు వెళ్తున్నారు. వారిలో మ‌హారాష్ట్ర అకోలా ప్రాంతానికి చెందిన స‌య్యద్ అమీర్(28), బీహార్ వాసి అబ్దుల్ స‌మీ (21) కూడా ఉన్నారు. వీరిద్దరూ గురువారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో మంచి నీళ్ల కోసం గొడ‌వ పడ్డారు.

అయితే కాసేపటికే గొడవ ముదిర‌డంతో మరింత తీవ్రరూపం దాల్చింది. వీరిలో స‌హ‌నం కోల్పోయిన అబ్దుల్ స‌మీ కోపంతో ఊగిపోతూ తన వద్ద ఉన్న క‌త్తితో స‌య్యద్ స‌మీర్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల‌పాలైన స‌య్యద్‌ బాధతో విలవిలలాడుతూ ఆహాకారాలు చేయడంతో.. తోటి కూలీలు అతడిని చికిత్స నిమిత్తం నాన‌ల్‌న‌గ‌ర్‌లోని ఓలివ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు అబ్దుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు గుడిమ‌ల్కాపూర్ ఇన్‌స్పెక్టర్ బైరి రాజు తెలిపారు.

Also read

Related posts

Share via