మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది..
మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతివేగంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని గాజులరామరంలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఈ ఘటన జరిగింది.. అతివేగం, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది.. గోపి (38) అనే సెక్యూరిటీ గార్డు స్పాట్ లోనే మృతి చెందాడు..
వీడియో చూడండి..
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘోర ప్రమాదం.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని.. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్‌కు తీసుకెళ్లి..





