నెల్లూరులోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది
నెల్లూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. జిల్లాలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయగా.. దీపావళి నుంచి మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం చేసినట్లు ఆటో డ్రైవర్ అంగీకరించినట్లు సమాచారం. కాగా ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయిముగ్గురిని వదిలేసి ఒంటరిగా భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అలీకి భకత్ సింగ్ కాలనీలో ఒక మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ద్వారానే ఆ బాలికను లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. సీఐ అన్వర్ బాషా నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





