SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: కాకినాడ నుంచి వచ్చి హోటల్‌లో దిగిన ఓ యువతి, ఇద్దరు యువకులు.. కట్ చేస్తే.. ఓర్నాయనో

ఓ యువతి.. ఇద్దరు యువకులు.. ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. వారి దగ్గర ఏవో బ్యాగులున్నాయి.. రాగానే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) లోని ఓ హోటల్ లో దిగారు.. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. వారున్న గదిలో తనిఖీలు చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.. వారు కాకినాడ నుంచి గంజాయి తీసుకొచ్చి.. హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు తేలింది.. ఈ ఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. గంజాయి విక్రయిస్తున్న యువతిని.. ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాకినాడ నుండి డ్రై గంజాయి తీసుకొచ్చిన ముగ్గురు.. కూకట్ పల్లి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ నుండి గంజాయ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయించేందుకు జ్యోతి, అజయ్, రమేష్ యత్నించారన్నారు.

కె.పి.హెచ్.బి లోని ఓ హోటల్ గదిలో ముగ్గురు ఉండగా దాడి చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 6 కేజీల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

గంజాయ్ ఎవరికి విక్రయిస్తున్నారు.. వారి నెట్ వర్క్ ఎక్కడుంది..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు

Also Read

Related posts