ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ప్రమాదంలో ఇన్ఫోసిస్ టెకీ సౌమ్య రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్‌పై వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. కారులో సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది..
హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఆలయానికి వెళ్లి తిరిగిగొస్తుండగా అనుకోని ప్రమాదం ఎదురైంది. వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై పల్టీలు కోడుతూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా.. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై సోమవారం (సెప్టెంబర్ 15) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యా రెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారులో ఉన్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్‌ఆర్ సమీపంలో కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని నంద కిశోర్, వీరేంద్ర, ప్రనీష్, అరవింద్, సాగర్, ఝాన్సీ, శ్రుతిగా గుర్తించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతురాలు సౌమ్యా రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
 - అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 





