March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: దుబాయ్‌లో భర్త.. హైదరాబాద్‌లో భార్య.. మధ్యలో ఓ యువకుడు.. సీన్ కట్‌చేస్తే..

ఆమెకు 32 ఏళ్లు.. స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది.. భర్త దుబాయ్ లో పనిచేస్తున్నాడు.. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.. ఈ క్రమంలో.. గతేడాది స్కూల్ లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది.. అప్పటికే.. ఆమెపై మనసు పడ్డ ఓ యువకుడు ఆమె అకౌంట్ ను ఫాలో అవుతూ.. అడ్మిషన్ కావాలంటూ మెస్సెజ్ చేసి.. ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు..


ఆమెకు 32 ఏళ్లు.. స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది.. భర్త దుబాయ్ లో పనిచేస్తున్నాడు.. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.. ఈ క్రమంలో.. గతేడాది స్కూల్ లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది.. అప్పటికే.. ఆమెపై మనసు పడ్డ ఓ యువకుడు ఆమె అకౌంట్ ను ఫాలో అవుతూ.. అడ్మిషన్ కావాలంటూ మెస్సెజ్ చేసి.. ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు.. ఇలా మాటలు కలిపి.. వేధించడం మొదలుపెట్టాడు.. ఆమె ఫోన్ నెంబర్లు మార్చినా.. ర్యాపిడో డ్రైవర్లను ఇంటికి పంపి వేధించడం మొదలుపెట్టాడు.. చివరకు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్‌ చేస్తా అంటూ బెదిరించడంతో.. ఆమె పోలీస్ స్టేషన్ కు చేరుకుని.. కంప్లైట్ ఇచ్చింది.. మహిళను వేధింపులకు గురించిచేస్తున్న ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని టోలిచౌకీలో చోటుచేసుకుంది.. మహిళ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు యువకుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.


వివరాల ప్రకారం.. టోలిచౌకి సమతాకాలనీలో నివసించే ఓ వివాహిత (32) స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తోంది.. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.. కాగా.. భర్త గత కొన్నేళ్ల నుంచి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. గతేడాది తన స్కూల్‌లో అడ్మిషన్లకు సంబంధించిన ప్రకటనను ఆమె తన ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్‌ చేసింది. దీంతో అప్పటికే ఆమె అకౌంట్ ను ఫాలో అవుతున్న షేక్‌ వసీం అనే యువకుడు అడ్మిషన్‌ కావాలంటూ ఆమె ఫోన్‌ నెంబర్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఆతర్వాత పలు విషయాల గురించి ఆరాతీశాడు.. అంతటితో ఆగకుండా.. తరచూ ఫోన్‌ చేస్తుండడంతో ఆమె ఫోన్ లిఫ్ట్‌ చేయడం మానుకుంది..

దీంతో వసీం స్కూల్‌కు వెళ్లి అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి ఆ మహిళ పర్సనల్‌ నెంబర్‌ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్‌కు, ఆమె ఇంటికి తిరుగుతూ 24 గంటలూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు పాల్పడుతుండేవాడు.. దీంతో ఆమె కాల్ లిఫ్ట్‌ చేయడం ఆపేసింది.


దీంతో వసీం ర్యాపిడో డ్రైవర్‌ను బుక్‌ చేసుకుని ఆమె ఇంటికి పంపించి పార్శిల్‌ ఇస్తారు.. తీసుకురా అని పంపించేవాడు.. ఆమె ఇంటికి వెళ్లిన ర్యాపిడో డ్రైవర్‌ను ఫోన్‌ ఆమెకు ఇవ్వు మాట్లాడతానంటూ చెబుతూ వేధించడం మొదలుపెట్టాడు. అయితే.. గత ఏడు నెలల నుంచి నిందితుడి వేధింపులు పెరగడం.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ఆ మహిళ.. అతనికి వార్నింగ్ ఇచ్చింది.. అయితే.. రెండు రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన వసీం.. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే తనను.. తన పిల్లలను కిడ్నాప్‌ చేస్తానంటూ మెసేజ్‌లు పెట్టాడు.. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 78(2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via