హైదరాబాద్‌లో ప్లాటో.. ఫ్లాటో కొంటున్నారా? అయితే బీకేర్‌ఫుల్..! బంపర్ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తారు.. ఆలోచిస్తే ఆశాభంగం అంటూ తొందర పెడతారు.. మంచితరుణం మించిన దొరకదంటూ అరచేతిలోవైకుంఠం చూపిస్తారు.. ఆ మాటలు నమ్మి..పెట్టుబడి పెట్టారో..ఇక గోవిందా..గోవింద..మీ డబ్బులపై ఆశలు వదలుకోవాల్సిందే..
హైదరాబాద్‌లో ప్లాటో.. ఫ్లాటో కొంటున్నారా? అయితే బీకేర్‌ఫుల్..! ఆ వెంచర్‌కు పర్మిషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మోసపోవడం ఖాయం. నగరంలోని రియల్ బూమ్‌ను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు..కొంతమంది కంత్రీగాళ్లు. ప్రీ-లాంచ్ ఆఫర్లు, మనీ బ్యాక్ గ్యారెంటీ, రెంట్ గ్యారంటీ అంటూ రియల్ ఊబిలోకి దించుతున్నారు. అందిన కాడికి దండుకుని..ఆ తర్వాత బోర్డు తిప్పేసి పరారవుతున్నాయి.
భారతి బిల్డర్స్, శుభోదయం, ప్రతిష్ట, ఒబిలి స్క్వేర్ యార్డ్స్, వివోన్ ఇన్‌ఫ్రా, అమికాన్ డెవలపర్స్, జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా.. ఇలా 20కి పైగా కంపెనీలపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయ్. ఈ కంపెనీలన్నీ కూడా కళ్లుచెదిరే ప్రీలాంచ్ డిస్కౌంట్ ఆఫర్లతోనే జనాన్ని ముంచేశాయి. వీటి చేతిలో మోసపోయిన బాధితులు..సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఆర్థిక నేర విచారణ విభాగం..వందకోట్ల రూపాయల పైగా మోసం జరిగినట్టు గుర్తించింది. ఆఫర్ల పేరుతో వినియోగదారులను ముంచేసిన 20 కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలంటూ..తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సూచించింది.
కొంపల్లిలో ప్రీలాంచ్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది భారతి బిల్డర్స్. ఆరున్నర ఎకరాలు చూపించి 395మంది నుంచి 60కోట్లను కొట్టేసింది. ఒక్కొక్కరి నుంచి 50లక్షలు వసూలుచేసి ముంచేసింది. ఇక శుభోదయం రియల్ ఎస్టేట్ కంపెనీ…యాదగిరిగుట్ట దగ్గర వెంచర్‌ని చూపించి 34మంది దగ్గర 7 కోట్లు కొట్టేసింది. ప్రతిష్ట కంపెనీ.. 45మంది నుంచి 4కోట్లు వసూలుచేసి పరువు తీసింది. ఒబిలి కంపెనీ కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. పెద్ద సంస్థగా పేరుగాంచిన జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా కూడా 80కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడింది. బందిపోట్ల కంటే ఘోరంగా జనాన్ని దోచుకున్నాయి ఈ దగా సంస్థలు.
వీడియో చూడండి..
ఈ మధ్య సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో రూపాయి రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వ్యక్తి..ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలు కొంటున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత మెుహం చాటేస్తున్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు..పోలీసులు.
ప్రీలాంచ్ ఆఫర్లపై కొనుగోలు దారులు అలర్ట్‌గా ఉండాలంటున్నారు..సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సెన్ వింగ్ డీసీపీ ప్రసాద్. ప్రాపర్టీ కొనేముందు ఆ వెంచర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయోలేదో చెక్ చేసుకుని..డాక్యుమెంట్స్ పరిశీలించాకే ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.
ప్రీలాంచ్ ఆఫర్ అంటేనే మోసం అని హెచ్చరిస్తోంది..రెరా. ప్రాజెక్టు లాంచ్ చేయకుండా సేల్ చేయడం నేరమని..ఇప్పటికే వందల మంది బాధితులు మోసపోయారని చెబుతున్నారు..రెరా అధికారులు.
Also read
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?