తెలంగాణలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల ఏర్పాటు చేయడంతో పాటు, నిరంతర తనిఖీలతో స్మగ్లర్ల ముఠాలను పట్టుకుంటున్నారు. కానీ స్మగ్లర్లు మాత్రం రోజురోజుకు ఇస్మార్ట్ ఐడియాలతో చెలరేగిపోతున్నారు. సామాన్యంగా కార్లలో, బైకుల డిక్కీలో, బ్యాగుల్లో గంజాయి దాచడం సహజమే. కానీ హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన మాత్రం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.
దూల్‌పేటకు చెందిన రోహన్ సింగ్ అనే యువకుడు గంజాయి రవాణాలో వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒడిశా నుంచి భారీగా గంజాయి తీసుకొచ్చిన అతడు…ఇంట్లో ఎక్కడ దాచాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అతడి వద్ద గంజాయి ఉందన్న పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇంట్లో అణువణువూ గాలించినా ఎక్కడా గంజాయి లభ్యమవ్వలేదు.
అయితే పోలీసులు అంతలా చెక్ చేస్తున్నా.. ఇంట్లోని దేవుని ఫోటోల ముందు పూజ చేస్తూ రోహన్ సింగ్ కదలకపోవడంతో.. అతని వ్యవహారంపై అధికారులకు అనుమానం కలిగింది. అతను పూజల చేస్తోన్న ఫొటోలను పరిశీలించగా వాటి వెనక గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వెంటనే రోహన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. బండారం బట్టబయలు అయింది. ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించిన రోహన్‌ను పోలీసులు అప్రమత్తంగా ఉండి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రోహన్ ఒడిశా నుంచి గంజాయి తెచ్చి దూల్‌పేటలో దాచిపెట్టి.. గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. అతడి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిపై సంబంధిత కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!