SGSTV NEWS
Andhra PradeshCrime

‘పార్టీ ఉందని పిలిచి.. చంపి గొయ్యి తీసి పాతెట్టాడు..!’ చెల్లితో మాట్లాడుతున్నాడని దారుణం

తన చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న అక్కసుతో ఓ యువకుడిని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడో అన్న. అనంతరం మృత దేహాన్ని గోతిలో పాతిపెట్టిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


విజయవాడ, జులై 5: విజయవాడలోని పి.వేమవరం గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తీక్ తన తండ్రితో కలిసి గ్రామంలో సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. అదే గ్రామానికి నులకతట్టి కృష్ణ ప్రసాద్ చెల్లితో కిరణ్ కార్తీక్ తరచూ ఫోన్ మాట్లాడుతుండేవాడు. ఈ విషయం తెలిసుకున్న కృష్ణ ప్రసాద్.. కిరణ్ కార్తీక్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు కొనసాగడంతో కిరణ్ కార్తీక్‌పై కృష్ణ ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు.

తన చెల్లి భవిష్యత్తు పాడవుతుందన్న భయం, ఉక్రోషంతో గ్రామానికి చెందిన వినోద్ ద్వారా గత నెల 24 వ తేదీ రాత్రి కిరణ్ కార్తీక్‌ను పార్టీ ఉందని పిలిచి బ్రహ్మానందపురం జగనన్న కాలనీ లే అవుట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కిరణ్ కార్తీక్‌పై దాడి చేసి కొట్టి, పిక నులిమి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం గొయ్యి తీసి పాతిపెట్టారు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని జూన్‌ 27వ తేదీన కిరణ్ కార్తీక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితులు కృష్ణ ప్రసాద్, వినోద్ లు హత్య చేసిన విషయాన్ని గ్రామ రెవిన్యూ అధికారికి చెప్పారు. ఎమ్మార్వో సమక్షంలో మృత దేహాన్ని పాతిపెట్టిన ఘటన స్థలాన్ని నిందితులు పోలీసులకు చూపించారు. నిందితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. ఘటన స్థలానికి చేసుకున్న మృతుని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

తన కుమారుడు వారి వద్ద పని చేసే కూలీలకు డబ్బులు ఎక్కువ ఇచ్చాడని మందలించానని తనపై కోపంతో ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని అనుకున్నామని, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని మృతుని తండ్రి వీర వెంకటరమణ వాపోయాడు. తన కుమారుడి హత్య చేసిన నిందితులకు ఆశ్రయం కల్పించిన వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కూడా కఠినంగా శిక్షించాలని మృతుని తండ్రి వీర వెంకట రమణ డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు.



Also read

Related posts

Share this