యువత ఎంత చెప్పినా వినడం లేదు. జీవితాలు తెల్లారిపోతున్నా మారడం లేదు. ఈజీ మనీ వేటలో పడి బెట్టింగ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఏమైందో తెలిసేలోపే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు. చివరకు అప్పులు ఇచ్చినోళ్ల నుంచి ఒత్తిడి.. మరోవైపు రూపాయి పుట్టక తనువు చాలిస్తున్నారు. తాజాగా..
బెట్టింగ్ మహా చెడ్డది.. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నడిరోడ్డుపై నిలబెట్టేస్తుంది అని చెప్పినా కొందరు యువకులు పట్టించుకోవడం లేదు. ఈజీ మనీ వేటలో పావులుగా మారి.. జీవితాలను దుర్బరం చేసుకునేవారు కొందరైతే.. అర్థాంతరంగా ముగించేవారు కొందరు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడం ఈ బెట్టింగ్ తీవ్రత మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఏదో ఒకచోట బెట్టింగ్స్ కారణంగా బలవన్మరణాలను చూస్తూనే ఉన్నాం. తాజా వార్త హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తో అప్పులపాలైన ఓ యువకుడు రైలు కింద పడి తనువు చాలించాడు.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన డీటేల్స్ ఇలా ఉన్నాయి… హైదరాబాద్‌లోని సుచిత్ర, BHEL క్వార్టర్స్‌లో ఉంటున్న రాజ్వీర్సింగ్ ఠాగూర్(25) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. దీంతో నాయనమ్మ, చిన్నాన్నల వద్ద పెరిగాడు. అయితే అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. ఆపై మద్యం కూడా. ఈ రెండింటి కాంబినేషన్ ఎలాంటి మనిషిని అయినా అద:పాతాళానికి పడేస్తుంది. యథావిధిగానే అప్పలు అయ్యాయి. తిరిగి చెల్లించాలని అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో పాలు పోలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అమ్ముగూడ-సనత్‌నగర్ రైల్వేస్టేషన్ల మధ్య వస్తున్న గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025