పెండ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న పెండ్లికొడుకు, అతని బంధువు రోడ్డు ప్రమాదం జరిగి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి వారం రోజులు మిగిలి ఉండగానే వరుడికి మృత్యువు ముంచుకొచ్చింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…
పెండ్లి పత్రికలు పంచే పనిలో ఉన్న ఇద్దరు యువకులు ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా వద్ద శనివారం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్‌పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మన్‌కు వారం రోజుల్లో పెండ్లి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంధువైన మురిమడుగు జస్వంత్‌తో కలిసి బైక్‌పై నిర్మల్ వైపు పెండ్లి పత్రికలు పంచడానికి బయలుదేరాడు.
అయితే ఖానాపూర్ చేరుకునేలోపే బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కల్వర్టును ఢీకొని చెట్ల పోదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మన్, జస్వంత్ ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
మరి కొన్ని రోజుల్లో ఇంట్లో శుభకార్యం అనుకుంటున్న వేళ జరిగిన ఈ విషాదం కుటుంబాన్ని విషాదసంద్రంలోకి నెట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..