SGSTV NEWS
CrimeNational

Delhi Dwarka Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం


ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో భారీఅగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌‌లోని ఆరో అంతస్తులో చెలరేగిన మంటల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో తండ్రి, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మంటల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది.

Delhi Dwarka Fire Accident: ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో భారీఅగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్‌మెంట్‌లోని ఏడవ అంతస్తులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అయితే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.. తండ్రి, అతని ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ మంటల్లో చిక్కుకున్నవారిని ఆకాశమార్గంలో తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. పలువురు ప్రాణభయంతో పైనుంచి దూకినట్లు తెలుస్తోంది.

దీనిపై ఢిల్లీ అగ్నిమాపక విభాగం పలు వివరాలు తెలిపింది. ‘‘ద్వారకలోని MRV స్కూల్ సమీపంలో ఉన్న షాబాద్ అపార్ట్‌మెంట్ నుండి ఉదయం 10.01 గంటలకు అగ్నిప్రమాదం గురించి డిపార్ట్‌మెంట్‌కు కాల్ వచ్చింది. మొదట్లో, ఎనిమిది అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించాం. మంటల పరిమాణం ఎక్కువగా కనిపించడంతో, మంటలను ఆర్పేందుకు మరిన్ని అగ్నిమాపక యంత్రాలను మోహరించాం.’’ అన్నారు.

Also read

Related posts

Share this