మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. కీసరగుట్టలోని ప్రసిద్ధి చెందిన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వెనుక భాగంలో ఉన్న లింగాలకుంట వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. ఆలయానికి సమీపంలో లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆ తర్వాత తవ్వకాలు చేపట్టినట్లు అనుమానిస్తున్నారు. అక్కడ ఓ మట్టి కుండ, ఎర్రని గుడ్డ, పసుపు, నీళ్ల బాటిల్ వంటి పూజ సామగ్రి లభ్యం కావడంతో ఇది పక్కా గుప్త నిధుల బ్యాచ్ పనే అన్నది గ్రామస్తులు నిర్ధారిస్తున్నారు..
శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించారని భక్తులు నమ్ముతారు. కీసరగుట్టకు ఈ తవ్వకాలు కొత్త విషయాలు కావని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు గుర్తుచేశారు. ఇవేవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. తగిన చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. ఈసారి తవ్వకాలు స్పష్టమైన ఆనవాళ్లను చూపుతున్నందున.. సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పురాతన దేవాలయాలను గుప్త నిధుల బ్యాచ్ టార్గెట్ చేస్తూ ఉండటంతో హైందవ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాటి సంరక్షణకు ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ సరైన చర్యలు తీసుకోవాలంటున్నారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





