తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజోలు ప్రాంతానికి చెందిన టెమూజియన్‌కు అమలాపురంనకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగినట్లు తెలిపాడు. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ, భార్యతో కలిసి అల్వాల్ లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు. తమకు ఐదేళ్ల కొడుకు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పెళ్లైనప్పటి నుండి భార్య తనను అకారణంగా హింసిస్తుందని తెలిపాడు. పలుమార్లు పెద్ద వాళ్ళ సమక్షంలో మాట్లాడిన ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు కన్నీరు పెట్టుకున్నాడు.
ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసానని.. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి, తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు.
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం