April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: అమానుషం.. ఆస్తి కోసం సొంత తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కన్న కూతురు!

జీవితమంతా కష్టించి కూడబెట్టిన సొమ్ముపై కన్నేసింది కన్న కూతురు. ఆస్తి దక్కదన్న అక్కసుతో ఏకంగా సొంత తండ్రిపైనే దాడికి తెగబడింది. తండ్రి రెండు కాళ్లు విరగ్గొట్టి ఆసుపత్రిపాలు చేసింది. ఈ దారుణ ఘటన మంగళవారం (ఆగస్టు 13) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్స్‌ కాలనీలో..


జయశంకర్‌ భూపాలపల్లి, ఆగస్టు14: జీవితమంతా కష్టించి కూడబెట్టిన సొమ్ముపై కన్నేసింది కన్న కూతురు. ఆస్తి దక్కదన్న అక్కసుతో ఏకంగా సొంత తండ్రిపైనే దాడికి తెగబడింది. తండ్రి రెండు కాళ్లు విరగ్గొట్టి ఆసుపత్రిపాలు చేసింది. ఈ దారుణ ఘటన మంగళవారం (ఆగస్టు 13) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్స్‌ కాలనీలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..


సింగరేణి విశ్రాంత కార్మికుడు వేల్పుల మల్లేశ్‌ కొన్నేల్ల క్రితం లక్ష్మారెడ్డి అనే వ్యక్తిని దత్తత తీసుకున్నాడు. పెంచి పెద్ద చేసి.. తన చిన్న కూతురు మహేశ్వరిని ఇచ్చి వివాహం జరిపించాడు. కూతురితోపాటు మల్లేశ్‌ సంపాదించిన మొత్తం ఆస్తిని కూడా అల్లుడికి ఇచ్చేశాడు. కానీ అంతటితో తృప్తిపడని కూతురు, అల్లుడు.. మల్లేశ్‌ వద్ద ఉన్న ఫిక్స్‌డ్‌ బాండ్లు, 2 గుంటల భూమిపై కూడా కన్నేశారు. అవి కూడా తమకే ఇవ్వాలని, లేదంటే చంపుతామని గత కొంతకాలంగా బెదిరింపులకు దిగారు.

కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందనే చందంగా.. ఓ పక్క కన్నపేగు, మరోపక్క పెంచిన బంధం మల్లేశ్‌ నోరు కట్టేసింది. దీంతో ఈ వ్యవహారం అతడు ఎవరికీ చెప్పకుండా కాలం వెల్లదీయసాగాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూతురు, అల్లుడితోపాటు మరో నలుగురు వచ్చి మల్లేశ్‌పై దాచి చేశారు. మల్లేశ్‌ను కదలకుండా పట్టుకొని రెండు కాళ్లు విరిగేలా తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాల పాలైన మల్లేశ్‌.. లేవలేని స్థితిలో ఉండటంతో జిల్లా కేంద్రంలోని 100 పడకల దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులకు తమ తండ్రి మెట్ల మీద నుంచి జారి పడ్డాడని వైద్యులకు తెల్పింది కూతురు. అయితే వైద్య పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. మల్లేశ్‌కు రెండు కాళ్లు విరిగాయని, ఎవరో తీవ్రంగా కొట్టడం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు చెప్పడంతో కూతురు, అల్లుడు ఖంగు తిన్నారు. అనక అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. బాధితుడు మల్లేశ్‌ భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూతురు మహేశ్వరి, అల్లుడు లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ నరేశ్‌కుమార్‌ తెలిపారు

Also read

Related posts

Share via