SGSTV NEWS
Telangana

Telangana: జర్రంత కునుకేసినవ్‌గా.! బ్రిడ్జిపై వెళ్తుండగా కనిపించింది చూసి బిత్తరపోయారు



వానొచ్చేనంటే.. వరదోస్తుంది.. వరదొచ్చేనంటే.. జలచరాలు మనల్ని పలకరిస్తాయి. అలాంటి ఘటన ఇది. ఓ మొసలి జనావాసాల్లోకి వచ్చి ఎంచక్కా హాయ్ చెప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

వీడియో ఇది:




వర్షం వచ్చిందంటే చాలు.. బురద ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒక్క బురద మాత్రమే కాదు.. జలచరాలు కూడా జనాలు తిరిగే ప్రాంతాలకు వచ్చేసి.. భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఘటన ఇది. తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద సోమవారం మొసలి పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే అటుగా వెళ్లిన వాహనదారులకు చుక్కలు చూపించింది.

సింగూర్ ప్రాజెక్ట్‌ నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఈ బ్రిడ్జి గుండా నీరు ప్రవహిస్తోంది. ఇక మంజీరా నది ప్రవాహంలో కొట్టుకువచ్చిన మొసలి పిల్లి.. ఎంచక్కా బ్రిడ్జి రైలింగ్‌పై సేద తీరుతోంది. ఇక దాన్ని చూసిన కొందరు జనాలు.. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొని అధికారులు మొసలి పిల్లను చాకచక్యంగా బంధించారు.

Also read

Related posts