సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిరణ్‌కు 5ఏళ్ల క్రితం లవ్‌మ్యారేజ్ అయింది. ఈమధ్య ఇద్దరికీ మనస్పర్థాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.
Telangana Crime: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రేమ వివాహానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. హ్యాపీగా జీవిస్తున్నారనుకున్న దంపతుల మధ్యలోకి మనస్పర్థాలు వచ్చాయి. అవి కాస్త పెరగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరివేసుకుని సూసైడ్(Husband Commits Suicide) చేసుకున్నాడు. తెలంగాణ(Telangana)లోని సిద్దిపేట జిల్లా(Siddipet District)లో జరిగిన ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భార్య కాపురానికి రావడం లేదని
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని నిర్మల్ నగర్ గ్రామానికి చెందిన కర్రె కిరణ్ (27)కు గత 5 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి జగదేవపూర్‌లోనే నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇలా భార్య, పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడిపేశాడు. అయితే ఇటీవల కాలం నుంచి భార్య భర్తల మధ్య మనస్పర్థాలు తలెత్తాయి.
దీంతో అవి కాస్త ఎక్కువ కావడంతో కిరణ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె తిరిగి కాపురానికి రాకపోవడంతో కిరణ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని హాస్పిటల్‌కు తరలించారు. కానీ కిరణ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!