April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో దారుణం జరిగింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి వద్ద హరిత రెస్టారెంట్‌ రూమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Telangana: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో దారుణం జరిగింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి వద్ద హరిత రెస్టారెంట్‌లో గురువారం ఓ ప్రేమజంట రూమ్‌ను అద్దేకు తీసుకున్నారు. శుక్రవారం వారు గది ఖాళీ చేయాల్సిఉంది. కానీ వాళ్లు చాలాసేపటి వరకు బయటికి రాలేదు

దీంతో సిబ్బంది గది కిటికీలు బద్దులుకొట్టారు. లోపల చూడగ ఆ ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు నారయణఖేడ్ మండలం నారాయణపేట గ్రామానికి చెందిన ఉదయ్‌(20), అలాగే అదే గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. వీళ్లిద్దరి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదని.. అందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 


ఇదిలాఉండగా.. ఇటీవల హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఓ కారు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా సజీవ దహనమయ్యారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆ ప్రేమజంట కారులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతులను యాదాద్రి జిల్లా జమిలాపేటకు చెందిన శ్రీరామ్, మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన లిఖితగా గుర్తించారు.

Also read

Related posts

Share via