SGSTV NEWS
CrimeTelangana

చాంద్రాయణ గుట్ట సమీపంలో మర్డర్‌..! మృతదేహం పక్కనే ఇంజెక్షన్లు..

చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణ గుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. గొంతుపై చాకుతో పొడిచిన గుర్తులు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. మృతుడిని మహమ్మద్ అబ్దుల్ అజీజ్ (25) గా అతని తండ్రి గుర్తించాడు. ఆయన ఏమన్నారంటే.. తన కొడుకు అతని భార్యని కలిసి వస్తాను అని వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదని తెలిపారు. తన కొడుకు గంజాయి బ్యాచ్‌తో తిరిగే వాడని వెల్లడించాడు. వాళ్లే ఇతనిని చంపి ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడని ఆయన పేర్కొన్నారు.

ఆయన ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలంలో ఇంజెక్షన్లు దొరకడంతో డ్రగ్స్ కూడా తీసుకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న చాంద్రాయణ గుట్ట ఏసీపీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం వేళ ఒక వ్యక్తి చనిపోయినట్లు సమాచారం అందుకొన్న ఇన్స్పెక్టర్ గోపి సంఘటన స్థలానికి చేరుకొని చెక్ చేయగా మహమ్మద్ అజీజ్ అక్తర్ గా గుర్తించారు. బాబా నగర్ నివాసి అయిన ఇతని పై కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అతని మెడపై గాయాలు ఉన్నాయి. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు

Also read

Related posts

Share this